ఫిలిప్పీన్స్‌‌లో హైదరాబాద్ అమ్మాయి తిప్పలు

ఫిలిప్పీన్స్‌‌లో హైదరాబాద్ అమ్మాయి తిప్పలు

ఫిలిప్పీన్స్ లో హైదరాబాద్ నవ్య అనే అమ్మాయి తిప్పలు పడుతోంది. రెండు రోజుల క్రితం నగరం నుంచి నవ్య వెళ్లింది. మెడిసిన్ విద్యనభ్యసిస్తున్న ఆమె.. గత మూడేళ్లుగా అక్కడే ఉంటోంది. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఆమె ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పడుతుండడం.. నిబంధనలు సడలించడంతో నవ్య తిరిగి ఫిలిప్పీన్స్ బయలుదేరింది. కానీ.. మనిల్లా ఎయిర్ పోర్టులో నవ్యను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పాస్ పోర్టు బ్లాక్ అయ్యింది.. తిరిగి ఇండియా వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో నవ్య ఎయిర్ పోర్టులోనే రాత్రి మొత్తం పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మనిల్లా ప్రాంతంలో రెండేళ్లుగా ఓ ఇంట్లో నవ్య నివాసం ఉండేది. కోవిడ్ టైంలో అధిక ఛార్జ్ ఇవ్వాలని ఇంటి ఓనర్ ఒత్తిడి చేసింది. డబ్బులు అధికంగా ఇవ్వకపోతే పాస్ పోర్టు బ్లాక్ చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. డబ్బులు తాను ఇవ్వకపోవడంతో పాస్ పోర్టును బ్లాక్ చేశారని నవ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటి ఓనర్ ఫిలిప్పీన్స్ పాస్ పోర్టు కార్యాలయంలోనే పని చేస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం సింగపూర్ ఇమ్మిగ్రేషన్ కస్టడిలో నవ్య ఉంది.