హైదరాబాద్ యువతికి రూ. 60 లక్షల ఆస్ట్రేలియా స్కాలర్‌షిప్‌

హైదరాబాద్ యువతికి రూ. 60 లక్షల ఆస్ట్రేలియా స్కాలర్‌షిప్‌

హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి రూ. 60 లక్షల స్కాలర్‌షిప్‌ను సాధించింది. హైదరాబాద్‌కు చెందిన కొల్లి శ్రాష్ట వాణి బెంగళూరులోని రేవా విశ్వవిద్యాలయంలో లా చదువుతుంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వోలెన్ గాంగ్ ‘చేంజ్ ద వరల్డ్’ పేరుతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే స్కాలర్‌షిప్‌ను శ్రాష్ట సొంతం చేసుకుంది. శ్రాష్టకు పుస్తకాలు, నవలలు రాయడం అలవాటు. ఆమె రాసిన తొలి కవితల పుస్తకం ‘వైల్డ్ వింగ్స్’ను ఈ మధ్యే విడుదల చేసింది. శ్రాష్ట తన 11 ఏళ్ల వయసులోనే హిందీలో ఓ కవిత రాశారు. ఆ తర్వాత తన 13 ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌లో తొలి కవిత రాశారు. వోలెన్ గాంగ్ యూనివర్సిటీ ఇచ్చే స్కాలర్‌షిప్‌ కోసం శ్రాష్ట వీడియో అప్లికేషన్‌ ద్వారా దరఖాస్తును పంపించింది. ఆ దరఖాస్తుతో పాటు తను రాసిన పుస్తకాన్ని కూడా యూనివర్సిటీకి పంపించింది. ఆ పుస్తకాన్ని మెచ్చిన యూనివర్సిటీ శ్రాష్టకు ఈ స్కాలర్‌షిప్‌‌ను అందచేయడానికి ముందుకొచ్చింది.

‘ఈ స్కాలర్‌షిప్ కోసం, నేను మార్చి 2019లో ప్రక్రియను ప్రారంభించాను. ‘నేను ప్రపంచాన్ని ఎలా మారుస్తాను’ అనే అంశంపై యూనివర్సిటీకి వీడియో అప్లికేషన్‌ను సమర్పించాను. ఆ వీడియోలో… నా రచనల ద్వారా నేను ప్రపంచాన్ని ఎలా మారుస్తానో పేర్కొన్నాను. నేను రాసిన ఒక కవితల పుస్తకం 2018లో విడుదలయింది. ఆ పుస్తకం నేను ఈ స్కాలర్‌షిప్‌ గెలుచుకోవడానికి ఎంతో సహాయపడింది. ఆ పుస్తకం కారణంగానే నేను ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాను’ అని శ్రాష్ట అన్నారు. ఈ ఏడాది యుఓడబ్ల్యూ నుండి స్కాలర్‌షిప్ పొందిన తొలి ఇండియన్ తానేనని, ఆ డబ్బు తన తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆమె అన్నారు.

‘శ్రాష్టని పుస్తకాలు చదవడానికి ఎప్పుడూ ప్రోత్సహించేవాళ్లం. అలా పుస్తకాలు చదవడమే ఆమె స్కాలర్‌షిప్ గెలవడానికి ముఖ్య కారణం. మేము ఎప్పుడూ శ్రాష్టని అది చేయమని, ఇది చేయమని బలవంతం చేయలేదు. ఆమెకు నచ్చనట్లు చేయమని ప్రోత్సహించేవాళ్లం’ అని శ్రాష్ట తల్లి ఆశా అన్నారు. శ్రాష్ట వాణి 2020 మార్చిలో ఆస్ట్రేలియాలోని యుఓడబ్ల్యూలో చేరనుంది.

For More News..

పది ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఒక మిల్క్ ప్యాకెట్ ఫ్రీ

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఫోన్‌తోనే తండ్రికి మెసెజ్ పంపి..

నిర్బయ తరహాలో.. బస్సులో మైనర్ బాలికపై అత్యాచారం