V6 News

హైదరాబాద్‌ గుడ్‌‌‌‌ షెపర్డ్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఆస్తులు జప్తు

హైదరాబాద్‌ గుడ్‌‌‌‌ షెపర్డ్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఆస్తులు జప్తు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆపరేషన్ మొబిలైజేషన్(ఓఎం ఇండియా) మనీలాండరింగ్ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ చారిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుడ్ షెపర్డ్ స్కూల్స్‌‌‌‌కు చెందిన రూ.3.58 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈమేరకు ఈడీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

 దళిత పిల్లల విద్య, అభ్యున్నతి కోసమని అమెరికా, కెనడా కేంద్రంగా దళిత్ ఫ్రీడమ్ నెట్‌‌‌‌వర్క్(డీఎఫ్‌‌‌‌ఎన్‌‌‌‌) పేరుతో క్రైస్తవ చారిటీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ పని చేస్తున్నది. దీనికి అనుబంధంగా దేశంలో ఆపరేషన్ మొబిలైజేషన్, ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేశారు. 

వీటిని డాక్టర్ జోసెఫ్ డిసౌజా, అతని కుమారుడు జోష్ లారెన్స్ డిసౌజా, కీలక ఆఫీస్ బేరర్లు నిర్వహించేవారు. ఈ క్రమంలోనే గుడ్ షెపర్డ్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఉచితంగా ఇంగ్లిష్​ మీడియం విద్య అందిస్తున్నామని చెప్పుకుంటూ రూ. 296 కోట్ల విరాళాలు సేకరించారని, వాటిని రియల్ ఎస్టేట్​ లావాదేవీలలోకి మళ్లించారని అధికారులు ఆరోపించారు.