
హైదరాబాద్లో వర్షం దంచికొడుతుంది. నగరంలో వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్.. ఫిలింనగర్ ..మొహదీపట్నం కార్వాన్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా ( మే 24 సాయంత్రం 7 గంటల సమయంలో) కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కాగా మరో 3 గంటలపాటు నగరాన్ని ఈ కుండపోత వర్షం కొనసాగనుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, మ్యాన్ హోల్స్ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. కాగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే సమయం కావడంతో నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి సమయంలో తీవ్రమైన తుఫాన్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.