హైదరాబాద్, వెలుగు: గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ (ట్రైడెంట్) దివాలా ప్రక్రియకు సంబంధించిన వివాదం కోర్టుల్లో తేలినా.. మళ్లీ అదే అంశంపై పిటిషన్ దాఖ లు చేసిన మహా హోటల్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీరును హైకోర్టు తప్పుబట్టింది. అనవ సర పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయ కుండా నియంత్రించేందుకు రూ.10 లక్షల జరిమానాను విధిస్తూ.. ఆ డబ్బును ప్రధానమంత్రి సహాయక నిధికి చెల్లించాలని ఆదేశించింది.
గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్‌ను సీఐఆర్‌పీ ప్రక్రియలో దక్కించుకున్న బీఆర్‌ఈపీ ఏసీయా-2 ఇండియా హోల్డింగ్ కంపెనీ (బ్లాక్ స్టోన్)కు అనుకూలంగా సాధికారిక కమిటీ (పర్యాటక శాఖ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. గోల్డెన్ జూబ్లీ హోటల్స్‌ను బ్లాక్‌స్టోన్ కంపెనీ దివాలా స్మృతి కింద చట్టబద్ధంగా దక్కించుకుందని, ఇది ప్రభుత్వం ఉదా రంగా కట్టబెట్టింది కాదని కోర్టు స్పష్టం చేసింది. దివాలా కోడ్ కింద దక్కించుకున్న ఈ ప్రాజెక్టులో టెండర్ ప్రసక్తి ఉండదని తెలిపింది.
కాంట్రాక్ట్ ఉల్లం ఘన, పరిహారం కోరుతూ పిటిషనర్ కంపెనీ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసిందని, అది పెండింగ్‌లో ఉన్నప్పుడు ఈ వివాదాలను అక్క డే తేల్చుకోవాలని చెప్పింది. అంతేగాని సాల్వ్ అయిన వివాదాలపై మళ్లీ పిటిషన్ వేయడానికి వీల్లేదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
