2031 నాటికి 100 కోట్లకు 5జీ యూజర్లు.. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్‌‌

2031 నాటికి 100 కోట్లకు 5జీ యూజర్లు.. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో 2031 చివరి నాటికి  5జీ సబ్‌‌స్క్రిప్షన్ల సంఖ్య 100 కోట్లను దాటుతుందని టెలికం కంపెనీ ఎరిక్సన్ మొబిలిటీ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఇంటర్నెట్ డేటా అత్యధికంగా వాడుతున్న దేశాల్లో భారత్‌‌ టాప్‌‌లో ఉంటుందని అభిప్రాయపడింది.

యూజర్‌‌‌‌ ఒక స్మార్ట్‌‌ఫోన్‌‌పై  నెలకు సగటున 65 జీబీ వినియోగిస్తాడని ఎరిక్సన్ రిపోర్ట్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ నెంబర్ 36 జీబీగా ఉంది.  ఈ ఏడాది చివరి నాటికి 5జీ యూజర్ల సంఖ్య 39.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా.  2031 చివరి నాటికి గ్లోబల్‌‌గా 640 కోట్ల 5జీ సబ్‌స్క్రిప్షన్లు రికార్డవుతాయని ఎరిక్సన్ రిపోర్ట్ వెల్లడించింది.