
ట్యాంక్ బండ్, వెలుగు: జీఎస్టీ 8వ వార్షికోత్సవం సందర్భంగా సీజీఎస్టీ అండ్ కస్టమ్స్ హైదరాబాద్ జోన్ ఆధ్వర్యంలో ‘క్విట్ ఇండియా’ పేరుతో ఆదివారం ఉదయం సైకిల్ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జీఎస్టీ కమిషనర్ రాకేశ్ గోయల్ జెండా ఊపి ప్రారంభించారు.
నెక్లెస్ రోడ్ నుంచి పీవీ జ్ఞానభూమి, జలవిహార్ మీదుగా 3 కిలోమీటర్ల మేర ఈ మారథాన్ నిర్వహించగా, జీఎస్టీ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజూ వాకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఫిట్‌నెస్ సాధించవచ్చని రాకేశ్ గోయల్ తెలిపారు.