కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు.. రూ. 3 వేల 600 కోట్ల విలువైన 36 ఎకరాల భూములు సేఫ్ !

కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు.. రూ. 3 వేల 600 కోట్ల విలువైన 36 ఎకరాల భూములు సేఫ్ !

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. - కొండాపూర్‌లో 36 ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. కొండాపూర్‌లో సర్వేనెంబర్‌ 59లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. 12 మంది రైతుల ఆధీనంలో ఎన్నం భూములు ఉన్నాయి. రూ. 3 వేల 600 కోట్ల విలువైన ఆస్తులని ప్రభుత్వం చెబుతోంది.

60 ఏళ్లుగా తమ ఆధీనంలోనే భూములున్నాయని రైతులు చెబుతున్నారు. -భూములను కాపాడుతూ వచ్చామనేది రైతుల వాదన. రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. కొండాపూర్లోని భిక్షపతి నగర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 

* కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు
* కొండాపూర్లోని భిక్షపతి నగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా
* ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా సిబ్బంది
* పోలీస్ బందోబస్త్ నడుమ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా
* కూల్చివేతల వద్దకు మీడియాను కూడా అనుమతించని పోలీసులు
* రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను అడ్డుకుంటున్న పోలీసులు