రంజీ మ్యాచ్‌‌లో నిలకడగా ఆడుతోన్న హైదరాబాద్‌‌

 రంజీ మ్యాచ్‌‌లో నిలకడగా ఆడుతోన్న హైదరాబాద్‌‌

హైదరాబాద్‌‌:  కెప్టెన్‌‌ తన్మయ్‌‌ అగర్వాల్‌‌ (210 బాల్స్‌‌లో 14 ఫోర్లతో 116 బ్యాటింగ్‌‌) సెంచరీతో దుమ్మురేపడంతో.. తమిళనాడుతో మంగళవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌ నిలకడగా ఆడుతోంది. రవితేజ (72) అండగా నిలవడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 70.4 ఓవర్లలో 256/5 స్కోరు చేసింది.

తన్మయ్‌‌తో పాటు మికిల్‌‌ జైస్వాల్‌‌ (32 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన హైదరాబాద్‌‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆరు బాల్స్‌‌ తేడాలో అభిరత్‌‌ రెడ్డి (0), రోహిత్‌‌ రాయుడు (0) డకౌట్‌‌గా వెనుదిరిగారు. ఓ ఎండ్‌‌లో తన్మయ్‌‌ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌‌లో తనయ్‌‌ త్యాగరాజన్‌‌ (28), జావీద్‌‌ అలీ (6) కూడా విఫలమయ్యారు. దీంతో 46 రన్స్‌‌కే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌‌ను తన్మయ్‌‌, రవిజేత ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌‌కు 141 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ నిలబెట్టారు. చివర్లో మికిల్‌‌ జైస్వాల్‌‌ మరో వికెట్‌‌ పడకుండా రోజును ముగించాడు.