Weather : రాబోయే రెండు రోజులు హైదరాబాద్ లో వర్షాలు..

Weather : రాబోయే రెండు రోజులు హైదరాబాద్ లో వర్షాలు..

వేసవి తాపం నుంచి రిలీఫ్ అయ్యే వార్త చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణ, హైదరాబాద్​లకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్​ జారీ చేసింది. జూన్​ 22, 23న రాష్ట్రంలోని చాలా ప్రాంతాలతో పాటు హైదరాబాద్​లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సిటీలో హైదరాబాద్​, చార్మినార్​, ఖైరతాబాద్​, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, ఎల్​బీ నగర్​, సికింద్రాబాద్​ నియోజకవర్గాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు చెప్పారు. జూన్​ 24, 25న తక్కువ నుంచి మధ్యస్థ స్థాయిలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

ఆ సమయంలో 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. జూన్​ 21న నిర్మల్​ జిల్లాలో అత్యధికంగా 43.2 డిగ్రీలు, హైదరాబాద్లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకి నిజంగా ఇది చల్లని కబురే. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో అనుకున్న మేర వర్షాలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.