హైదరాబాద్, వెలుగు: ఐటీఎఫ్ మెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ ఎం15 హైదరాబాద్ టోర్నీలో ఇండియా ప్లేయర్లు రాఘవ్ జైసింఘాని, ఆర్యన్ లక్ష్మణన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ (టీఎస్‌టీఏ) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ క్లబ్‌లో సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లో ఆర్యన్ 7–6(2), 7–5తో రెండో సీడ్ అలెక్సీ అలెషెవ్ (రష్యా)కు చెక్ పెట్టాడు.
నాలుగో సీడ్ రాఘవ్ 3–6, 7–6(5),10–5తో ఇండియాకే అనికేత్ వెంకటరామన్ ను ఓడించగా.. సార్థక్ 6–3, 6–4తో పార్థ్ అగర్వాల్‌పై, ఆదిత్య బల్సేకర్ 7–5, 7–6(1)తో కాహీర్ వారిక్‌పై, అర్జున్ రాఠీ 6–3, 6–2తో రిషి రెడ్డిపై, ఉదిత్ కాంబోజ్ 4–6, 6–1, 10–6తో గంటా సాయి కార్తీక్ రెడ్డిపై విజయం సాధించి మెయిన్ డ్రా చేరుకున్నారు. మంగళవారం మెయిన్ డ్రా పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభిస్తారని టీఎస్‌టీఏ తెలిపింది.
