కాకా ఫాలోవర్ ఆవుల బాలనాథం

కాకా ఫాలోవర్ ఆవుల బాలనాథం

డెక్కన్ పీట భూమి నిజాం స్టేట్ నడిగడ్డ మీద జన్మించి మాదరి భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన ఆది హిందూ సోపల్ లీగ్ సర్వీస్ లో విద్యార్థి నాయకడిగా ప్రవేశించి హైదరాబాద్ కేంద్రంగా సుమారు నాలుగు దశాబ్దాల పాటు జరిగిన అనేక ఉద్యమాలకు కీలక భూమిక పోషించిన నాయకుడు ఆవుల బాలనాథం.

 హైదరాబాద్ నడిబొడ్డులోని తూర్పు బజారులో మాల కులం సామాజిక వర్గానికి చెందిన బాలమ్మ, బీసయ్య దంపతులకు మూడో కుమారుడుగా 25 డిసెంబర్ 1945న బాలనాథం జన్మించాడు.  హైదరాబాద్ కేంద్రంగా భాగ్యరెడ్డి వర్మ అనేక ఉద్యమాలు సామాజిక కార్యక్రమాలకు ప్రభావితమై చాదర్​ఘాట్​లోని ఆది హిందూ భవన్ లో విద్యార్థి దశనుండే పాల్గొన్నారు.   కార్మిక నాయకుడుగా ఎంపికైన ఆవుల బాలనాథంకు కేంద్ర మంత్రి గుడిసెల వెంకటస్వామితో పరిచయం ఏర్పడింది.  ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని సుమారు 150  బస్తీలలో కమిటీలను ఏర్పాటు చేశారు.

1980 దశకంలో కర్నూలు జిల్లాలోని రాఘవేంద్ర స్వామి దేవాలయంలోకి అప్పటి శాసనసభ్యులు మసాలా ఈరన్నను పూజారులు దేవాలయ ప్రవేశానికి అడ్డుకోవడంతో ఆ సంఘటన నివసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వమే జయంతి, వర్ధంతిలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆవుల బాలనాథంప్రతిపాదన మేరకు కేంద్ర మంత్రి గుడిసెల వెంకట్ స్వామి  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రభుత్వం తరఫున జయంతి, వర్ధంతి నిర్వహించాలని ఒప్పించారు. ఆవుల బాలనాథం  నవంబర్​6, 2021న  లోకానికి దూరమయ్యారు.

- అస శ్రీరాములు