హైదరాబాద్లో ఈసారి ఎండలు దంచికొట్టనున్నాయి

హైదరాబాద్లో ఈసారి ఎండలు దంచికొట్టనున్నాయి

హైదరాబాద్లో ఈసారి ఎండలు దంచికొట్టనున్నాయి. వచ్చే వారం నుంచి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌ చేరే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది విపరీతమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఫిబ్రవరి 11 నుంచే సమ్మర్ ఎఫెక్ట్ స్టార్ట్ కానుంది. అయితే ఉష్ణోగ్రతలు పగటికే పరిమితతాయని .. రాత్రుళ్లు, ఉదయం మాత్రం చలి ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ఫిబ్రవరి చివరివారం వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వేసవి తుఫానులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే దాని గురించి ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని అధికారులు అంటున్నారు. కాగా నగరంలోని ఉప్పల్‌, కాప్రా, కుత్బుల్లాపూర్, శేర్‌లింగంపల్లి, ఖైరతాబాద్‌, షేక్‌పేట్‌, ఆసిఫ్‌ నగర్‌, బహదూర్‌పురాతో పాటు సైదాబాద్‌ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.