బషీర్‌బాగ్, వెలుగు: ఆన్లైన్ పెట్టుబడుల పేరిట ఓ వ్యక్తిని స్కామర్లు మోసం చేశారు. నల్లకుంటకు చెందిన 52 ఏండ్ల వ్యక్తి ఫేస్బుక్లో ‘ఇన్వెస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే యాడ్‌ను నమ్మి తన వివరాలు నమోదు చేశాడు. దీంతో స్కామర్లు ‘స్టడీ సర్కిల్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో బాధితుడిని చేర్చి ట్రేడింగ్, పెట్టుబడిపై సూచనలు ఇచ్చారు.
వారి మాటలు నమ్మిన బాధితుడు.. స్కామర్స్ సూచించిన ట్రేడింగ్ అప్లికేషన్లో విడతల వారీగా మొత్తం రూ.45 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, రూ. 6.9 కోట్ల లాభం ఉన్నట్లు చూపించారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
