- ప్రతి అంగుళం రియల్ టైమ్ ఇన్ఫోతో మ్యాపింగ్
- ప్రతి అంగుళాన్ని రియల్ టైమ్ ఇన్ఫోతో మ్యాపింగ్ చేయొచ్చు
- ప్రభుత్వ భూముల రక్షణ ఈజీ
- కన్సల్టెన్సీ నియామకానికి టెండర్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: కొత్తగా విస్తరించిన మహానగరంలోని ప్రాంతాన్నింటితో కలిసి హెచ్ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్‌ప్లాన్–2050 ప్రక్రియలో త్రీడీ డిజిటల్ట్విన్ టెక్నాలజీ వినియోగించాని అధికారులు నిర్ణయించారు. దీంతో నగరంలోని ప్రతి అంగుళాన్ని రియల్ టైమ్ సమాచారంతో లింక్‌చేసి మ్యాపింగ్ తయారే చేయొచ్చు. హెచ్ఎండీఏ పరిధి 7,652 చ. కి.మీ. నుంచి 11,052 చ.కి.మీ. విస్తరించిన నేపథ్యంలో 2050 టార్గెట్‌గా హెచ్ఎండీఏ మెగా మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తోంది.
జోన్ల వారీగా సిటీని విస్తరించడం, చెరువులను కాపాడడం, గ్రీనరీ ఏర్పాటు, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు తప్పించడం, పబ్లిక్ట్రాన్స్పోర్టేషన్మెరుగుపర్చడం వంటి అనేక అంశాలను మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరుస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి డ్రాఫ్ట్మాస్టర్ప్లాన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, త్రీడి డిజిటల్ట్విన్టెక్నాలజీ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలోనే కన్సల్టెన్సీ నియమించేందుకు టెండర్లను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు.
- ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా
త్రీడీ డిజిటల్ట్విన్టెక్నాలజీతో భవిష్యత్‌లో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా ప్లాన్లు రూపొందించుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పర్యవేక్షణ, అక్రమ నిర్మాణాల పై నిఘా పెంచడానికి చాన్స్ఉంటుందంటున్నారు. కన్స్ట్రక్షన్స్తీసుకున్న అనుమతుల ప్రకారమే జరుగుతుందా లేదా అన్నది పర్యవేక్షించవచ్చంటున్నారు. రోడ్లు ఆక్రమణలు, విస్తరణ, ఇవన్నీ కూడా డిజిటల్డేటాతో పోల్చి చర్యలు తీసుకోవచ్చు. ఈ టెక్నాలజీతో సిటీలోని ప్రభుత్వ భూములను డిజిటల్ గా రికార్డు చేయొచ్చు.
- ఏంటీ టెక్నాలజీ
త్రీడీ డిజిటల్ ట్విన్టెక్నాలజీ అంటే నగర ప్రతి రూపాన్ని సృష్టించే లేటెస్ట్టెక్నాలజీ. నగరంలోని రోడ్లు, బిల్డింగులు, డ్రైనేజీ సిస్టమ్, వాటర్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ, ట్రాఫిక్ ఇలా అన్ని అంశాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై త్రీడీ రూపంలో పొందుపర్చి రియల్ టైమ్సమాచారంతో లింక్‌చేయడం, దీని కోసం లైడర్ సర్వే చేసి నగర రూపురేఖలను తయారు చేస్తారు. డ్రోన్లు, శాటిలైట్ఇమేజెస్, జీఐఎస్, ఏఐ టెక్నాలజీతో డిజిటల్మ్యాప్రూపొందిస్తారు. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి ప్రాంతం వెడల్పు, పొడవు, ఎత్తులను త్రీడీలో మ్యాపింగ్చేస్తారు. దీనివల్ల ఓఆర్ఆర్వరకూ సిటీలోని ప్రతి చోటును రియల్ టైమ్‌లో ఉన్నది ఉన్నట్టుగా చూడొచ్చు.
