
బషీర్‌బాగ్, వెలుగు: నిరుద్యోగ యువత కోసం ఈ నెల 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు దక్కన్ బ్లాస్టర్స్ చైర్మన్ మన్నన్ ఉల్లాహ్ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రెడ్ హిల్స్ ఫంక్షన్ హాల్ లో 17న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల జాబ్ మేళా ఉంటుందన్నారు. పదవ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు పాల్గొనవచ్చని చెప్పారు.
ఐటీ, నాన్ ఐటీ జామ్స్కోసం ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. వర్క్‌ఫ్రం హోం అవకాశం కూడా ఉందని, 21 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ చేస్తున్నామని చెప్పారు. మరింత సమాచారం కోసం 83743 15052లో సంప్రదించాలని కోరారు.