
- బెట్టింగ్ యాడ్స్ తొలగిస్తే చాలా అంటూ నెటిజన్స్ ఫైర్
- సెలబ్రిటీలపై నమోదు చేసినట్లే.. మెట్రో పైనా కేసులు పెట్టాలని డిమాండ్
- చట్టం అందరికీ సమానం కాదా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు
- మెట్రోకే తెలియకపోతే మాకెలా తెలుస్తుందని హీరోయిన్ అనన్య పోస్ట్
హైదరాబాద్, వెలుగు:మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై వివాదం కొనసాగుతూనే ఉంది. రోజూ లక్షలాది మంది ప్రయాణించే పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఏమిటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు సెలబ్రెటీలపై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో మెట్రోపై కూడా కేసులు నమోదు చేయాలని ఎక్స్ వేదికగా నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రెటీలపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ క్రమంలో మెట్రోలో ఓ బెట్టింగ్ యాప్ కు సంబంధించి ప్రమోషన్స్ చేయడంపై సోషల్‌మీడియాలో విమర్శలు రాగా, ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. అలాంటి యాడ్స్ ను తక్షణమే తొలగించాలని ఎల్ అండ్ టీ, సంబంధిత అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీలను ఆదేశించారు. అయితే, ఈ వివాదం ఇంతటితో సద్దుమణగలేదు. సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రమోట్ చేస్తేనే కేసులు నమోదు చేస్తున్నారని, అలాంటిది రోజూ లక్షలాది మంది ప్రయాణించే పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న మెట్రోపై కేసులు నమోదు చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను మెన్షన్ చేసి ప్రశ్నిస్తున్నారు.
రోజూ ఐదు లక్షల మంది..
హైదరాబాద్ మెట్రో 57 రైళ్లతో రోజూ1050పైనే ట్రిప్పులతో 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారు మెట్రోలో ప్రయాణం చేస్తుంటారు. సోషల్‌మీడియాలో బెట్టింగ్యాప్స్ప్రమోట్చేస్తున్న సెలబ్రిటీలు కొన్ని లక్షల మందికి చేరువ అవుతారని, అదే మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేయడం వల్ల రోజూ లక్షలాది మంది ప్రభావితమయ్యే అవకాశం ఉంటుదని, మెట్రో తీవ్రతే అధికంగా ఉంటుందని నెటిజన్స్అంటున్నారు. ఏమీ తెలియని వారు, సెలబ్రిటీలు డబ్బు కోసం బెట్టింగ్యాప్స్ను ప్రమోట్చేస్తుంటారని, కానీ, మెట్రో లాంటి సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇదే మొదటిసారి కాదు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం(పీపీపీ) మోడ్ లో నడుస్తోంది. దీని నిర్వహణ బాధత్యలు ఎల్ అండ్ టీ చూసుకుంటోంది. మెట్రోలో యాడ్స్ డిపార్ట్మెంట్ కూడా ఎల్అండ్ టీ పరిధిలోనే ఉంటుంది. ప్రస్తుతం థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా మెట్రో యాడ్స్ నిర్వహిస్తోంది. 2022లోనే మెట్రో స్టేషన్లలో ఆన్లైన్రమ్మీ, తీన్ పత్తి లాంటి వాటిని మెట్రో స్టేషన్లలో ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి.
అప్పట్లో మెట్రో ఎండీ స్పందించి అలాంటి యాడ్స్ పై ఎల్అండ్ టీ ని హెచ్చరించారని సమాచారం. మరోవైపు రెండేండ్ల నుంచి మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మెట్రో ఎండీ ఆదేశించినా మళ్లీ ఎలా రిపీట్ అయ్యాయి అన్నది తెలియడం లేదు. మెట్రోలో యాడ్స్ ను పర్యవేక్షించే టీమ్స్ లేవా? లేక అధికారులు ఆదాయం మీదే దృష్టి పెట్టి బెట్టింగ్యాప్స్ను ఎంకరేజ్చేస్తున్నారనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మాకు అవగాహన లేదు.. మరి మెట్రోకు ఏమైంది.?
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు, సినిమా యాక్టర్లు, ఇతర సెలబ్రెటీలపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రెటీలు వివరణ ఇచ్చుకుంటున్నారు. తమకు అవగాహన లేక ప్రమోట్ చేశామని, క్షమించాలని కోరుతున్నారు. అయితే, విచారణను ఎదుర్కొంటున్న నటి అనన్య నాగళ్ల కూడా క్షమాపణ వీడియో విడుదల చేసింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో మెట్రో బెట్టింగ్ప్రమోషన్పై ప్రశ్నల వర్షం కురిపించింది.
‘నేను తెలుసుకోవాలనుకుంటున్నా...ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెట్రోలోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తుంటే, మేం ప్రమోట్ చేసేది లీగలో, ఇల్లీగలో మాకెలా తెలుస్తుంది’ అంటూ మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేసిన ఫొటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీంతో అనన్య వాదనకు కొందరు నెటిజన్స్ సపోర్టు చేస్తున్నారు. మరికొందరేమో తప్పు ఎవరు చేసినా తప్పేనని బదులిస్తున్నారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్1974, సవరణ 2017 ప్రకారం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గ్యాంబ్లింగ్ పూర్తిగా నిషేధించబడిందని, ఈ చట్టం కింద, డబ్బు పందెం కాసే ఏ ఆట అయినా చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందంటున్నారు. ఈ నిషేధం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వాటిని నిర్వహించడంపై కూడా వర్తిస్తుందంటున్నారు. చట్టం ఉల్లంఘిస్తే రెండేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందంటున్నారు.