ట్రేడింగ్ పేరుతో రూ.36 లక్షలు ముంచిన్రు.. ఏపీలో 8 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

ట్రేడింగ్ పేరుతో రూ.36 లక్షలు ముంచిన్రు.. ఏపీలో 8 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి, వెలుగు: ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ట్రేడింగ్ కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన గుర్రం నవీన్ చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిందితులు వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘బార్​క్లేస్’ పేరుతో గ్రూప్ సృష్టించి సంప్రదించారు. 

ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. రూ.7 కోట్ల లాభం వచ్చినట్లు నకిలీ డేటా చూపించారు. దీంతో మోసపోయిన నవీన్ చందర్ విడతల వారీగా రూ.36.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. చివరికి కేవలం రూ.5 వేలు మాత్రమే తిరిగి రావడంతో మోసం జరిగినట్లు గుర్తించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుల వివరాలు సేకరించారు. 

అనంతరం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమీరం గ్రామంలో దాడులు నిర్వహించి 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో డిగ్రీ విద్యార్థులు, డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 45 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, మూడు రౌటర్లు, రెండు ట్యాబ్లు, 40 ఏటీఎం కార్డులు, 20 సిమ్ కార్డులు, 22 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులను స్వాధీనం
 చేసుకున్నారు.