- 50 కిలోల మటన్‌తోపాటు కుళ్లిన రొయ్యలు, చేపలు సీజ్
మెహిదీపట్నం, వెలుగు: నగరంలో జనం హెల్త్‌తో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్ల లీలలను పోలీసులు బట్టబయలు చేశారు. హబీబ్‌నగర్ పరిధిలో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి పెద్ద హోటళ్లకు తక్కువ ధరకు అమ్ముతున్న మహమ్మద్ ఉస్మాన్ ఖురేషిని హెచ్-ఫాస్ట్ అధికారులు, పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. మల్లేపల్లిలోని అతని షాపుపై దాడి చేసి 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మాంసాన్ని టెస్టింగ్కోసం చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని నాచారం లో ‘‘తెలంగాణ స్టేట్ ఫుడ్ లాబొరేటరీ’’కి పంపిస్తున్నట్లు సీఐ తెలిపారు.
మరో కేసులో.. మంగళ్‌హాట్ పరిధిలోని ‘‘తార ఫిషరీస్” దుకాణంపై టాస్క్‌ఫోర్స్, పోలీసులు దాడి చేసి కుళ్లిన చేపలు, రొయ్యలు అమ్ముతున్న శంకర్ సింగ్(24), మాన్ సింగ్(32), గులాబ్ సింగ్(36), రోహిత్ సింగ్(31)లను అరెస్ట్ చేశారు. బేగంబజార్ నుంచి తక్కువ ధరకు కుళ్లిన నిల్వలు తెచ్చి, వాసన రాకుండా సోడియం పౌడర్ కలిపి తాజా వాటిగా హోటళ్లు, ఫంక్షన్లకు సప్లై చేస్తున్నారు. వీరి నుంచి రూ.90 వేల విలువైన 100 కిలోల పాడైపోయిన రొయ్యలు, 162 కిలోల చేపలు, 10 కిలోల సోడియం బైకార్బోనేట్ పౌడర్, 6 బస్తాల ఉప్పును పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
