హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జనవరి 9, 10 తేదీల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్చెకింగ్లో 404 మంది పట్టుబడ్డారు. వీరిలో 349 మంది టూ-వీలర్, 24 మంది త్రీ-వీలర్, 31 మంది ఫోర్- వీలర్, ఇతర వాహన డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 45 మందికి 151–200 మధ్య, 23 మందికి 201–250, 9 మందికి 251–300, 12 మందికి 300 పైన రీడింగ్ వచ్చింది. అందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సైబరాబాద్ పరిధిలో చేపట్టిన వీకెండ్ చెకింగ్ లో137 మందిని పట్టుకున్నారు. వీరిలో 92 మంది బైకర్లు, 5 మంది ఆటో డ్రైవర్లు, 39 మంది కారు డ్రైవర్లు, ఒకరు హెవీ వెహికల్ డ్రైవర్ ఉన్నారు. వీరిలో 16 మందికి 201-300, 13 మందికి 301-500 పాయింట్లు వచ్చింది. గత వారం సైబరాబాద్ పరిధిలో నమోదైన 929 కేసుల్లో నిందితులను కోర్టులో హాజరు పరిచారు. వీరిలో 23 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష, 33 మందికి జరిమానాతో సామాజిక సేవ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. 873 మందికి కేవలం జరిమానా వేశారు.
