అక్రమంగా హైదరాబాద్ లో ఉంటూ... డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్.. చివరికి..

అక్రమంగా హైదరాబాద్ లో ఉంటూ... డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్.. చివరికి..

డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ స్మగ్లర్స్ ని కట్టడి చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట తరచూ డ్రగ్స్ కలలకం రేపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు దుండగులు. గురువారం ( అక్టోబర్ 9 ) అక్రమంగా హైదరాబాద్ లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ ను గుర్తించారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

నైజీరియాకు చెందిన 46 ఏళ్ళ ఓనోరా సోలమన్ చిబుజే అనే వ్యక్తి అక్రమంగా దేశంలో ఉంటూ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. వీసా, పాస్ పోర్ట్ కాలం చెల్లినప్పటికీ హైదరాబాద్ లో అక్రమంగా ఉంటూ గంజాయి విక్రయిస్తున్నాడు నైజీరియన్. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు FRRO సహకారంతో నిజిరియాకు డిపార్ట్ చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని.. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు పోలీసులు.

ఇదిలా ఉండగా.. కరీంనగర్​ జిల్లాలో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మెడికల్​ షాపు లలో తనిఖీలకోసం వచ్చిన డ్రగ్స్​కంట్రోల్​అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బాధితుడి నుంచి లంచం డిమాండ్​ చేసిన డ్రగ్స్​ కంట్రోల్​ అధికారులు రెడ్​ హ్యాండెడ్​ గా ఏసీబీ అధికారులకు దొరికారు.. వివరాల్లోకి వెళితే.. 

 కరీంనగర్​ పట్ణణంలోని విజేత హాస్పిటల్​మెడికల్​ షాపులో మంగళవారం (అక్టోబర్​ 7) తనిఖీలునిర్వహించారు కరీంనగర్​ జిల్లా డ్రగ్స్​ కంట్రోల్​ అధికారులు. షాపు నిర్వాహకుడినుంచి రూ.20వేల లంచం తీసుకుంటుండగా డ్రగ్స్​  కంట్రోల్​ అడ్మినిస్ట్రేషన్​ లో పనిచేస్తున్న  డ్రగ్​ కంట్రోల్​ అసిస్టెంట్​ డైరెక్టర్​ మర్యాల శ్రీనివాస్, డ్రగ్​ ఇన్ స్పెక్టర్​ కార్తీక్​ భరద్వాజ్​ తోపాటు, ప్రైవేట్​ పర్సన్​ రాము ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​ గా దొరికారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్​ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు అధికారులు.