
- ఉత్తర్వులు జారీ చేసిన సీపీలు సీవీ ఆనంద్, అవినాశ్ మహంతి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్కమిషరేట్ల పరిధిలో డ్రోన్లు, క్రాకర్స్‌పై నిషేధం విధించారు. భారత్, పాకిస్తాన్మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ అవినాశ్మహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ల వాడకంపై నిషేధం అమలులో ఉంటుందని సీపీ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ మేరకు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
జూన్ 9వ తేదీ వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఫైర్ క్రాకర్స్ కాల్చ కూడదని సీపీ ఆనంద్పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ శబ్ధాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందన్నారు.