హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్-న్యూ) చేపట్టిన చర్యల్లో గత ఏడాదిలో 563 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు కాగా, రూ.22.17 కోట్ల విలువైన నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 2025 నుంచి ఈ ఏడాది జూన్ వరకు నమోదైన కేసుల్లో అత్యధికంగా జూబ్లీహిల్స్ జోన్‌లో 116 కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్ జోన్‌లో 99, గోల్కొండలో 95, చార్మినార్‌లో 90, రాజేంద్రనగర్‌లో 84, ఖైరతాబాద్‌లో 49, శంషాబాద్ జోన్‌లో 30 కేసులు నమోదయ్యాయి.
