
వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు పోలీసు శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. దీని కోసం మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు పోలీసు శాఖ తెలిపింది.అంతేకాకుండా పాత చలాన్లను క్లియర్ చేసుకునే క్రమంలో డిస్కౌంట్ కూడా ప్రకటించనున్నట్టు తెలిపారు అధికారులు. టు వీలర్ వాహనదారుల పెండింగ్ చలానా కోసం 25శాతం వరకు చెల్లింపునకు అవకాశం ఉంటుందని.. మిగతా 75శాతాన్ని మాఫీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అదేవిధంగా కార్లకు 50శాతం,ఆర్టీసీ బస్సులకు 30శాతం,తోపుడు బండ్లకు 20శాతం వరకు చెల్లింపునకు ఛాన్స్ కల్పిస్తున్నారు పోలీసు అధికారులు. దీనికి సంబంధించి ఆన్‌లైన్, మీ సేవా సెంటర్లలోని గేట్‌వేల ద్వారా చెల్లింపులు జరవచ్చన్నారు.
పెండింగ్ చలాన్లు ..హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్లకు పైగా ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు ఈ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చామని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం..