
కామారెడ్డి, వెలుగు: హైదరాబాద్పబ్లిక్ స్కూల్ బేగంపేట్, రామంతాపూర్లో 2025–-26 సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సతీశ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్టీలకు సంబంధించి బాలురకు 3, బాలికలకు 3 సీట్లు ఉన్నాయన్నారు.
ఆసక్తి గలవారు కుల, ఆదాయ ధ్రువపత్రాలను జత చేసి, అప్లికేషన్లను ఈ నెల 5 సాయంత్రం 5 గంటల్లోగా కలెక్టరేట్లోని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఆఫీస్రూమ్నంబర్ 208లో అందజేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు 01.06.2018 నుంచి 31.05.2019 మధ్య జన్మించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు ఆఫీస్లో సంప్రదించాలని సూచించారు