
సికింద్రాబాద్: జంట నగరాలను వాన ముసురు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో వర్షం మొదలైంది. ఈ రోజు(గురువారం) ఉదయం నుంచి ముసురు పట్టి చినుకులు పడుతున్నాయి. అయితే.. సాయంత్రానికి వర్షం పెరిగింది. ఇప్పుడు ఓ మాదిరిగా పడుతుంది. ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, రసూల్ పుర, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్, సీతాఫల్ మండీతో పాటు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుండటం గమనార్హం. దీంతో.. వెహికల్ మూమెంట్ స్లో అయింది. వర్షం పెరిగితే ట్రాఫిక్ జామ్ ఇబ్బంది తప్పేలా లేదు. హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్ పల్లి, లింగం పల్లి, బాలా నగర్, చింతల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. సిటీలో వర్షం కారణంగా కొన్నిచోట్ల రోడ్లు కాలువలను తలపించాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. దీంతో.. ఈ సమస్యపై GHMC, హైడ్రా దృష్టి సారించాయి. నగరంలో వర్షం పడిందంటే చాలు బైక్పైనో.. కారుతోనో రోడ్డెక్కాలంటే సిటీ పబ్లిక్ వణికిపోతున్న పరిస్థితి ఉంది. రోడ్లపై నిలిచే నీటితో గంటలకు గంటలు రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ కావడమే దీనికి కారణం. గత శుక్రవారం స్కూల్స్, ఆఫీసులు వదిలే సమయంలో వాన దంచి కొట్టడంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచి రోడ్లు బ్లాక్ అయిపోయాయి. దీంతో ఈ సమస్యపై హైడ్రా, బల్దియా కమిషనర్లతో పాటు ట్రాఫిక్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. చిన్నపాటి వాన పడిన కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో మళ్లీ రిపీట్కాకుండా యాక్షన్ప్లాన్చేపట్టారు.
ALSO READ | భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న జలపాతాలు .. కనువిందు చేస్తున్న బొగతా, గుండాల
హైదరాబాద్ నగరంలో సెంటిమీటర్ కు మించి వాన పడితే రోడ్లపై నీరు చేరుతోంది. దీంతో మెయిన్రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వర్షం పడిందంటే చాలు.. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కొత్తగూడ చౌరస్తా రౌల్వే అండర్ బ్రిడ్జి(ఆర్ యూ బీ) తో పాటు గచ్చిబౌలిలోని ఇంద్రానగర్ గమన్ దవాఖాన వద్ద, ఆరాంఘర్ ఆర్యూబీ తదితర ప్రాంతాల్లో వరద చేరి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. షేక్ పేట్, మాసబ్ ట్యాంక్, తెలుగుతల్లి , మూసాపేట్, గచ్చిబౌలి, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్లతో పాటు ప్యాట్నీ నుంచి పంజాగుట్ట వరకు ఫ్లై ఓవర్లపై వెహికిల్ మూవ్ మెంట్ స్లో అవుతున్న పరిస్థితి ఉంది.
#HYDTPinfo #rainalert
— Hyderabad Traffic Police (@HYDTP) July 24, 2025
It's #Raining
Commuters drive slowly and safely.#HyderabadRains #Monsoon2025 pic.twitter.com/yRjNwbwDiP