భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న జలపాతాలు .. కనువిందు చేస్తున్న బొగతా, గుండాల

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న జలపాతాలు .. కనువిందు చేస్తున్న  బొగతా, గుండాల

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. దీనికి తోడు ఎగువన కురుస్తున్న వానలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తెలంగాణలో జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. బొగతా, గుండాల జలపాతాలు పొంగిపొర్లుతూ పర్యాటకులకు కనువిందు చేస్తు్న్నాయి. 

కుమ్రంబీమ్ జిల్లా తిర్యాని మండలంలో  గుండాల జలపాతం అందాలు గుండెలను  హత్తుకుంటున్నా యి.  ప్రకృతి ప్రేమికులను  అకట్టుకుంటున్నా యి. గుండాల జలపాతం నూట ఇరవై  ఐదు  మీటర్ల ఎత్తు నుండి  ప్రవాహిస్తూ కనువిందు చేస్తోంది. బాహుబలిగా పిలుచుకునే ఈ జలపాతం అందాలు చూసి  పర్యాటకులు మురిసిపోతున్నా రు. 

మరోవైపు ములుగు జిల్లాలో భారీ వరదలకు బోగత జలపాతాలు మహోగ్రరూపం దాల్చాయి. అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో పెద్ద నదిలా కనిపిస్తోంది  వరదనీరు.  గేమ్స్ పార్క్, మంచవరద నీటిలో మునిగిపోయాయి.

జలపాతాల సందర్శన తాత్కాలికంగా బంద్ :

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరద ఉదృతి తగ్గేవరకు పర్యాటకులు ఎవరూ రావద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.