హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్

హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్

హైదరాబాద్లో వాతావరణ ఒక్కసారిగా మారింది. కూల్ వెదర్ వచ్చేసింది. కొన్ని రోజులుగా మండే ఎండలతో ఇబ్బంది పడిన జనం.. చల్లటి గాలులతో ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి ఏరియాల్లో జల్లులు పడ్డాయి. ఎండాకాలం ప్రారంభంలోనే మండే ఎండలతో బెంలేతెత్తిన జనానికి ఇది కొంచెం రిలీఫ్.. మరో మూడు, నాలుగు రోజులు ఇలాంటి కూల్ వెదర్.. హైదరాబాద్ సిటీలో ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

2024 మార్చి 18న సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మాడు పగిలే ఎండలతో విలవిలలాడిన ప్రజలు వర్షం కురవడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. వాతావరణం చల్లబడటంతో సేదతీరారు. 

మియాపూర్, చందానగర్ లో చిరుజల్లులు పడ్డాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్, ఐడీపీయల్, షాపూర్ నగర్, జీడిమెట్లలో వర్షం పడింది. అటు సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పటాన్ చెరు, రామచంద్రాపురం, బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూల్ వెదర్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, జనగాం, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. చిరు జల్లులు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.