హైకోర్టు వార్నింగ్​తోనైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలె

హైకోర్టు వార్నింగ్​తోనైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రిజిస్ట్రేషన్లపై జరిగిన విచారణలో ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. రిజిస్ట్రేషన్లను నిలిపివేసి, రియల్ వ్యాపారులతోపాటు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని,  కొంత కాలంగా తమ సంఘం పోరాటం చేస్తుందన్నారు.  కేంద్రం పరిధిలోని రిజిస్ట్రేషన్ల చట్టాన్ని కూడా కాలరాసేలా ప్రభుత్వ సీఎస్ వ్యవహరించారని ఆరోపించారు. తాజా ఆదేశాలతోనైనా ప్రభుత్వ  పాలన తీరులో మార్పు రావాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం  ధరణిని రద్దు చేయాలని, లేదంటే తప్పులను సవరించి బాధితులను ఆదుకోవాలని, ఇప్పటికే ధరణి కారణంగా ఎదురైన ఇబ్బందులతో మరణించిన కుటుంబాలను పరిహారం చెల్లించాలన్నారు. ధరణి గొప్పగా ఉందంటూ ప్రచారం చేసుకున్న సీఎస్ సోమేశ్​కుమార్ స్పందించాల్సిన బాధ్యత ఉందని బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.