 
                                    హైదరాబాద్ సిటీ, వెలుగు : జంట జలాశయాల పరీవాక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద తగ్గుముఖం పట్టింది. బుధవారం వరకూ ఉస్మాన్సాగర్ఆరుగేట్లను, హిమాయత్సాగర్మూడు గేట్లను ఓపెన్‌చేసిన అధికారులు గురువారం ఒక్కో గేటు ద్వారానే నీటిని దిగువన మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీ కి 1,450 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌కు 1,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 450 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. అలాగే హిమాయత్ సాగర్‌కు 2,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, వెయ్యి క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే 6,200 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలినట్టు అధికారులు తెలిపారు.

 
         
                     
                     
                    