ఇంట్లోనే గంజాయి మొక్కలు

ఇంట్లోనే గంజాయి మొక్కలు

పోలీసులు ఎక్కడికక్కడ దాడులు చేసి గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకడుతున్నారు.రైళ్లు, బస్సులు, ఆటోలో గుట్టుగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తాను నివసిస్తున్న ఇంట్లోనే గుట్టుగా గంజాయిని పెంచి...  పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రల్ గోదావరి గార్డెన్ లో జరిగింది. 

ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఏడు పెద్ద కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తులను  జవహార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే నిందితుడు మాత్రం తనకు గంజాయి అలవాటు ఉందని.. అందుకే ఇంట్లో మొక్కలు పెంచానన్నారు. తన స్నేహితులు కొందరికి గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాని తెలిపాడు. 

అయితే పోలీసులు విచారణలో నిందితుడు గత కొన్నాళ్లుగా గంజాయి మొక్కలను పెంచుతూ స్థానికంగా యువతను లక్ష్యంగా చేసుకొని వారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.అల్వాల్ డిప్యూటీ mro, రెవిన్యూ ఇన్స్పెక్టర్, సమక్షంలో పంచనామా నిర్వహించి, మొక్కలను సీజ్ చేసి నిందితులను జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు జవహార్ నగర్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తెలిపారు.