
రెండురోజులుగా ఆగకుండా పడిన వర్షాలకు హైదరాబాద్ రోడ్లు గుంతల మయంగా మారాయి. ఎక్కడ చూసినా కంకర లేలిన రోడ్లే కనిపిస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. సిటీలో దాదాపు 4వేలకు పైగా గుంతలు ఏర్పడినట్లుగా అంచనా వేస్తున్నారు. గుంతలను, దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు మరమ్మతు పనులు చేపట్టారు.
మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు మేయర్ బొంతు రామ్మోమన్, కమిషనర్ దాన కిశోర్. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో పురాతన, శిథిలావస్థలో ఉన్న భవనాలపై దృష్టి పెట్టాలన్నారు. స్కూల్ భవనాలపై స్పెషల్ ఫోకస్ చేయాలన్నారు.