ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్, నేషనల్ లేజర్ చాంపియన్‌షిప్ మంగళవారం ఘనంగా మొదలైంది. హుస్సేన్ సాగర్ లేక్‌పై వారం రోజుల పాటుజరిగే ఈ మెగా ఈవెంట్‌లో 11 క్లబ్‌ల నుంచి మొత్తం 89 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 11 మంది మహిళలు ఉండగా.. తెలంగాణ నుంచి 17 మంది పోటీ పడ్తున్నారు. ఓల్డెస్ట్ సెయిలర్‌గా 72 ఏండ్ల మురళీ కానూరి బరిలో నిలిచాడు. తొలి రోజు ప్రాక్టీస్ రేసులు నిర్వహించారు. బుధవారం నుంచి మెయిన్ రౌండ్ జరుగుతుంది. యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐవేఐ) గుర్తింపు ఉన్న ఈ టోర్నీ రాబోయే ఆసియా గేమ్స్‌కు ట్రయల్ ఈవెంట్‌గా ఉపయోగపడనుంది.
- వెలుగు, హైదరాబాద్
