కరాటేలో అక్కాచెల్లెళ్ల వరల్డ్ రికార్డ్

కరాటేలో అక్కాచెల్లెళ్ల వరల్డ్ రికార్డ్
  •  నిమిషాల 36 సెకన్లలో 11 విభాగాల్లో 121  టెక్నిక్స్ ప్రదర్శన

బషీర్​బాగ్, వెలుగు:  హైదరాబాద్ లోని నారాయణగూడ వైఎంసీఏ దగ్గరున్న జీవీఆర్ కరాటే అకాడమీ స్టూడెంట్స్ ఏటా కరాటేలో వరల్డ్ రికార్డ్స్ నమోదు చేస్తున్నారు. తెలంగాణ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అకాడమీలో 9 నిమిషాల 36 సెకన్లలో 11 విభాగాల్లో 121   టెక్నిక్స్​ ప్రదర్శించి ఆరోసారి వరల్డ్ రికార్డ్ సాధించారు అమృతారెడ్డి, గణ సంతోషిణి రెడ్డి అనంతరం సర్టిఫికెట్ ​అందుకున్నారు.

 ఈ ఏడాది అవార్డును ఆపరేషన్ సిందూర్ కు అంకితం ఇస్తున్నట్లు వారు తెలిపారు. అకాడమీ డైరెక్టర్ జీఎస్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కాచెల్లెళ్లు వరుసగా ఆరుసార్లు వరల్డ్ రికార్డులు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కో ఆర్డినేటర్  విజయలక్ష్మి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేందర్ గౌడ్ ఉన్నారు.