నాంపల్లిలో రూ. 3.60 లక్షల విదేశీ మద్యం పట్టివేత

నాంపల్లిలో రూ. 3.60 లక్షల విదేశీ మద్యం పట్టివేత

హైదరాబాద్​ సిటీ, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను ఎస్టీఎఫ్ ఏ టీమ్‌‌ పట్టుకుంది. నాంపల్లి పరిధిలోని ఆదర్శనగర్‌‌ లో ఇనోవా కారును తనిఖీ చేయగా,  52 నాన్​డ్యూటీ పెయిడ్ విదేశీ మద్యం బాటిళ్లు ఉండడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 వీటి విలువ సుమారు రూ. 3.60 లక్షల వరకు ఉంటుందన్నారు.కేసులో శ్రీకుమార్ అగ్రవాల్, రోహిత్ కుమార్‌‌ ను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు సురేనియా చంద్రదీపు పరారీలో ఉన్నాడు. నిందితులతోపాటు స్వాధీనం చేసుకున్న మద్యం, కారును నాంపల్లి పీఎస్​కు తరలించారు.