నవీపేట్, వెలుగు : పౌష్టికాహారంతో పిల్లల ఎదుగుదలతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందని శివ తండా ప్రభుత్వ స్కూల్ హెచ్ఎం శివకుమార్ అన్నారు. శనివారం స్కూల్లో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆహారపదార్థాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు 40 రకాల వంటాకాలు తెచ్చి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, బాగా చదివి ఉన్నతంగా ఎదగాలన్నారు. ఇంటి పరిసరాల శుభ్రతతోపాటు జంక్ ఫుడ్స్తీసుకోకుండా ఇంట్లో పోషక విలువలుగల ఆహార పదార్థాలు వండి పెండితే పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీచర్ రాజు పాల్గొన్నారు.
