సంక్రాంతి పండుగతో హైదరాబాద్ నగరం ఖాళీ

సంక్రాంతి పండుగతో హైదరాబాద్ నగరం ఖాళీ

సంక్రాంతి పండుగతో నగరం ఖాళీ అయ్యింది. ఇతర ప్రాంతాలకు చెందిన జనాలంతా సొంతూళ్లకు వెళ్లిపోవడంతో ప్రధాన రోడ్లు, ఫ్లై ఓవర్లు, మెయిన్​సెంటర్లు బోసిపోయి కనిపించాయి. ట్యాంక్​బండ్​, లక్డీకాపూల్, అసెంబ్లీ, అమీర్​పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్​, కూకట్​పల్లి, ఐటీ కారిడార్​, నానక్​రామ్​గూడ, హైటెక్​సిటీ, దిల్​సుక్​నగర్​, ఎల్బీ నగర్​, మలక్​పేట తదితర ప్రాంతాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. నిత్యం గంటల తరబడి ట్రాఫిక్​సమస్యలను ఎదుర్కొనే నగర ప్రజలు బుధవారం మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోయారు. అంతటా వాహనాల రణగొణ ధ్వనులు తగ్గాయి. – హైదరాబాద్ సిటీ, వెలుగు