
ఎల్బీనగర్, వెలుగు: నగరంలో ఆపిల్నకిలీ యాక్సెసరీస్ సప్లై చేస్తున్న ముగ్గురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్ యాక్సెసరీస్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ వైవీఎస్.సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహమ్మద్ షాహిద్ అలీ నగరంలోని మీర్ఆలం మండిలో, ఇర్ఫాన్అలీ ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్నారు. వీరు అఫ్జల్ గంజ్ కు చెందిన సంతోష్ రాజ్ పురోహిత్ తో కలిసి ముంబయి నుంచి ఆపిల్ నకిలీ యాక్సెసరీస్ ను కొనుగోలు చేసి, నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సోమవారం ఆపిల్కంపెనీ సిబ్బందితో కలిసి మీర్ఆలం మండిలో దాడి చేసి, ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 28 ఆపిల్డూప్లికేట్వాచ్ లు, 1,145 నకిలీ ఎయిర్ పాడ్స్, యూఎస్బీ కేబుల్స్, అడాప్టర్స్, స్టిక్కర్స్, లేబుల్స్, సెక్యూరిటీ సీల్స్ స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్చేసినట్లు డిప్యూటీ కమిషనర్పేర్కొన్నారు.