
ఎల్ బీనగర్, వెలుగు: ఇంజినీరింగ్ కాలేజీలో చోరీ ఘటన నాగోల్ పీఎస్ పరిధిలో జరిగింది. కులవల్లి రమేశ్ రావు తట్టి అన్నారంలోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కాలేజీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. స్టూడెంట్ల నుంచి వసూలు చేసిన ఫీజులు రూ.12 లక్షలను మంగళవారం సాయంత్రం కాలేజీ బిల్డింగ్ మూడో అంతస్తులోని తన లాకర్లో పెట్టాడు.
అదేరోజు రాత్రి కొందరు వ్యక్తులు కాలేజీ లోపలికి వచ్చి లాకర్‌ను కట్ చేసి అందులో ఉన్న రూ.12 లక్షలను ఎత్తుకెళ్లారు. బుధవారం కాలేజీకి వెళ్లిన రమేశ్ రావుకు లాకర్లో పెట్టిన డబ్బు కనిపించలేదు.
దీంతో వెంటనే నాగోల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.