ఓల్డ్‌సిటీ వెలుగు : ఓల్డ్‌సిటీలోని నెహ్రూ జూ పార్క్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండతోపాటు బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. గత మూడు రోజులుగా వరుస సెలవులు రావడంతో నగరంలోని హోటళ్లలో దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు పర్యాటకులు వచ్చారు.
ఆదివారం నెహ్రూ జూ పార్క్‌ను 25,875 మంది సందర్శించగా, దాదాపు 10 వేల మంది చార్మినార్‌పైకి ఎక్కి నగర అందాలను తిలకించారు. రద్దీ కారణంగా ఓల్డ్‌సిటీలోని ఇరుకు రోడ్లతో సందర్శకులకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. కిలోమీటర్ వరకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ జామ్, పార్కింగ్ సమస్యలతో సతమతమయ్యారు.
