మన్ కీ బాత్ చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన్ కీ బాత్ చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు, పారిశుధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైందని.. ప్రపంచంలో ఏ ప్రధాని చేయని కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ చేస్తున్నారని కొనియాడారు. 

స్వచ్ఛ భారత్ పేరుతో పారిశుధ్య కార్మికులతో కలిసి చెత్త తొలగించి వారికి గౌరవం కల్పించారని గుర్తు చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు బెడ్ షీట్స్, స్వెటర్స్ పంపిణీ చేశారు.