మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన స్టేట్ లెవల్ సాఫ్ట్ బాల్ విన్నర్ మహబూబ్నగర్

మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన  స్టేట్ లెవల్ సాఫ్ట్ బాల్ విన్నర్ మహబూబ్నగర్
  •     రన్నరప్​గా నిలిచిన నిజామాబాద్​
  •     ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఆదర్శ స్కూల్​లో మూడు రోజుల పాటు నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి గర్ల్స్​సాఫ్ట్​బాల్(అండర్​19)​ పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్​లో మహబూబ్​నగర్, నిజామాబాద్ ​జిల్లా జట్ల మధ్య పోటీ జరిగింది. మహబూబ్​నగర్​ జట్టు 3-2 స్కోర్​తో విజేతగా నిలిచింది. వరంగల్, ఆదిలాబాద్​జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పోటీల విజేతలకు మంచిర్యాల ఒలింపిక్​అసోసియేషన్ ​సెక్రటరీ పిన్నింటి రఘునాథ్​రెడ్డి, డీఐఈవో అంజయ్య, ఎస్​జీఎఫ్​ కార్యదర్శి బాబురావు బహుమతులు అందజేశారు. 

అనంతరం ఆయా క్రీడా సంఘాల బాధ్యులను సన్మానించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో కూడిన రాష్ట్ర జట్టు జనవరిలో నాగ్​పూర్​లో జరిగే జాతీయస్థాయి సాఫ్ట్​బాల్​ పోటీల్లో పాల్గొంటుందని ఎస్​జీఎఫ్​ కార్యదర్శి బాబురావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్​జీఎఫ్(అండర్​17) సెక్రటరీ యాకుబ్, మోడల్​ స్కూల్ ​ప్రిన్సిపాల్​సారా తస్లీమా, పెద్దన్న, పీఈటీలు పాల్గొన్నారు.