బీ అలర్ట్ : 4వ తేదీ ఉదయం (బుధవారం).. కేబుల్ బ్రిడ్జి చుట్టూ ట్రాఫిక్ మళ్లింపు

బీ అలర్ట్ : 4వ తేదీ ఉదయం (బుధవారం).. కేబుల్ బ్రిడ్జి చుట్టూ ట్రాఫిక్ మళ్లింపు

సైక్లింగ్ ఓట్, వాకథాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా 2023 ఆక్టోబర్ 4వ  తేదీన కేబుల్ బ్రిడ్జి చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్‌ పోలీసులు ఆదేశించారు. కేబుల్ బ్రిడ్జ్ - ఇనార్బిట్ మాల్ - మై హోమ్ అబ్రా - ఐటిసి కోహినూర్ - కేబుల్ బ్రిడ్జ్ నుండి ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమలులో ఉండనున్నాయి.

రోడ్ నంబర్ 45 నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ ను  కావూరి హిల్స్ నుండి మాదాపూర్పోలీస్ స్టేషన్ - COD జంక్షన్ సైబర్ వైపు మళ్లించబడుతుంది. అదేవిధంగా, బయో డైవర్సిటీ పార్క్ జంక్షన్ నుండి కేబుల్ బ్రిడ్జ్ వైపు వచ్చే  ట్రాఫిక్ ను   సైబర్ టవర్స్ - COD ,  జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 వైపు మళ్లించబడుతుంది.  

మీనాక్షి జంక్షన్ నుండి కేబుల్ బ్రిడ్జ్ వైపు వచ్చే ట్రాఫిక్ IKEA రోటరీ - లెఫ్ట్ టర్న్ - సైబర్ టవర్స్ - COD - రోడ్ నంబర్ 45 నుండి మళ్లించబడుతుంది.  సిఓడి నుంచి దుర్గంచెరువు, ఐటిసి కోహినూర్ నుంచి ఐకియా రోటరీ, ఐకియా రోటరీ నుంచి ఐటిసి కోహినూర్ వైపు భారీ వాహనాలను అనుమతించరు.