హైదరాబాద్ సిటీ పోలీసుల టైమింగ్ వేరే లెవెల్..!

హైదరాబాద్  సిటీ  పోలీసుల టైమింగ్ వేరే లెవెల్..!

" కుమారి అంటీ " ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈమె తెలియనివారు ఉండరు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్క వీడియోతో ఓవర్ నైట్ సెలెబ్రిటీ అయ్యింది రోడ్ సైడ్ మీల్స్ అమ్ముకొని బతికే కుమారి. సోషల్ మీడియాలో ఈమెకున్న క్రేజ్ వల్ల షాప్ దగ్గర ఏర్పడ్డ రద్దీ కారణంగా ఆ మధ్య ట్రాఫిక్ పోలీసులు షాప్ ని మూసేయమని ఒత్తిడి తెచ్చిన పరిస్థితి కూడా చూశాం. ఆ సమయంలో పోలీసుల పట్ల సోషల్ మీడియాలో వెల్లువెత్తిన నిరసన వల్ల ఈ ఇష్యూ సీఎం రేవంత్ రెడ్డి వరకూ చేయటం, ఆయన కుమారి ఆంటీ షాప్ ని యదావిధిగా రన్ చేసుకొమ్మని చెప్పటం అందరికీ తెలిసిన విషయమే.

ఆ రోజు షాప్ మూసేయమని ఒత్తిడి తెచ్చిన పోలీసులే ఈ రోజు ఆమె డైలాగ్ ను వాడుకుంటున్నారు. విషయమేమిటంటే, ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి పోస్ట్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. " మీది మొత్తం 1000 అయ్యింది, రెండు లివర్లు ఎక్స్ట్రా " అన్న కుమారి ఆంటీ డైలాగ్ కి స్పూఫ్ గా ఆ ట్వీట్ ఉండటమే ఇందుకు కారణం.

టూవీలర్ మీద హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్లో మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ " మీది మొత్తం వెయ్యి అయ్యింది, యూజర్ చార్జెస్ ఎక్స్ట్రా" అంటూ షేర్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.