శ్రీరామనవమి శోభాయాత్ర.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీరామనవమి శోభాయాత్ర.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
  • శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో సీతారాంబాగ్‌‌ నుంచి కోఠి వరకు డైవర్షన్ 

హైదరాబాద్,వెలుగు: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా సిటీలో ఈ నెల 30న ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిటీ సీపీ ఆనంద్‌‌ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. సీతారాంబాగ్ నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు 7 కి.మీ మేర వెహికల్స్ దారి మళ్లింపు ఉంటుందని సీపీ తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ శ్రీరామాలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర  బోయిగూడ కమాన్, మంగళ్‌‌ హాట్, జాలీ హనుమాన్, దూల్‌‌పేట్, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమ్మెరాత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్ ఛత్రీ, సిద్ది అంబర్ బజార్, గౌలిగూడ ఛమాన్, గురుద్వార్, పుత్లిబౌలీ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోనుంది. 

సీతారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి 

  • అసిఫ్‌‌నగర్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ మల్లేపల్లి క్రాస్‌‌ రోడ్స్ నుంచి విజయనగర్ కాలనీ, మెహిదీపట్నం వైపు వెళ్లాలి. 
  • బోయిగూడ కమాన్ నుంచి సీతారాం బాగ్  వైపు వచ్చే వెహికల్స్ ఆగాపురా, హబీబ్‌‌ నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
  • ఆగాపురా, హబీబ్‌‌నగర్ నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్​ను దారుసలాం వైపు మళ్లిస్తారు. 
  • బోయిగూడ కమాన్ నుంచి పురానాపుల్ వెళ్లే వాటిని దారుసలాం మీదుగా మళ్లిస్తారు.
  • పురానాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే వెహికల్స్​ను,పేట్లబురుజు, కార్వాన్, కుల్సుంపురా వైపు మళ్లిస్తారు.
  • ఎంజే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వెహికల్స్​ను జుమ్మెరాత్ బజార్ , సిటీ కాలేజీ, అఫ్జల్​గంజ్​ వైపు మళ్లిస్తారు. 
  • మాలకుంట నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వచ్చే వెహికల్స్​ను దారుసలాం వైపు మళ్లిస్తారు.
  • అఫ్జల్‌‌గంజ్ నుంచి సిద్ధిఅంబర్‌‌బజార్ రూట్ లో వచ్చే వాటిని సాలార్ జంగ్ బ్రిడ్జి వద్ద దారి మళ్లిస్తారు.
  • రంగ్‌‌మహల్, కోఠి నుంచి గౌలిగూడ ఛమాన్ వైపు వెళ్లే వెహికల్స్ ను జాంబాగ్, ఎంజే మార్కెట్ వద్ద దారి మళ్లిస్తారు,
  • అఫ్జల్‌‌గంజ్ నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వచ్చే వెహికల్స్​ను మదీనా, సిటీ కాలేజ్ వైపు దారి మళ్లిస్తారు.

అఫ్జల్ గంజ్,కోఠి పరిసర ప్రాంతాల్లో ఇలా..

  • అఫ్జల్​గంజ్ నుంచి కోఠి వచ్చే వాహనాలు సెంట్రల్ లైబ్రరీ, సాలార్​జంగ్​ మ్యూజియం వైపు దారి మళ్లిస్తారు.
  • రంగ్ మహల్ నుంచి వచ్చే ట్రాఫిక్​ను సీబీఎస్ వైపు మళ్లిస్తారు.
  • రంగ్ మహల్, ఆంధ్రా బ్యాంక్ నుంచి వచ్చే వెహికల్స్​ జాంబాగ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • బ్యాంక్ స్ట్రీట్ నుంచి పుత్లిబౌలి వైపు ట్రాఫిక్​ను అనుమతించరు.
  • బ్యాంక్ స్ట్రీట్ నుంచి వచ్చే ట్రాఫిక్ ర్యాలీ ముగిసే వరకు డీఎంహెచ్ఎస్  వైపు 
  • మళ్లిస్తారు.
  • చాదర్​ఘాట్ బ్రిడ్జి, సాయి బాబా టెంపుల్ నుంచి  వచ్చే ట్రాఫిక్​ను నింబోలి అడ్డా వైపు దారి మళ్లిస్తారు.
  • నారాయణగూడ, కాచిగూడ నుంచి వచ్చే వెహికల్స్ స్టేషన్ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
  •  చర్మాస్ నుంచి వచ్చే వెహికల్స్ ఎంజే మార్కెట్, నాంపల్లి స్టేషన్ రోడ్​ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
  • అబిడ్స్​ జీపీవో నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు ట్రాఫిక్​కు అనుమతి లేదు. 
  • తిలక్ రోడ్, కింగ్‌‌కోఠి నుంచి వచ్చే వెహికల్స్​ బొగ్గులకుంట క్రాస్‌‌ రోడ్స్‌‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.