రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు

రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు

హైదరాబాద్ లో ఓ మహిళా కాంట్రాక్టర్‌ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)కు చెందిన ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పట్టుకుంది.

కేపీహెచ్ బీ సబ్ డివిజన్‌కు చెందిన అదనపు డివిజనల్ ఇంజనీర్ బి ఉదయ కుమార్ అదే కార్యాలయంలో పనిచేస్తోన్న ఆర్టిసన్ గ్రేడ్ II బి కోటి రెడ్డి ద్వారా అదనపు విద్యుత్ లోడ్, కమర్షియల్ లోడ్ మంజూరు కోసం కాంట్రాక్ట్ సూపర్‌వైజర్ తాళ్ల ప్రవీణ్ నుంచి రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. ఒప్పందం ప్రకారం, కోటిరెడ్డి రూ. 50వేలు లంచం స్వీకరించాడు.  ఈ సమయంలోనే ఏసీబీ(ACB)అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం ఉదయకుమార్, కోటిరెడ్డిలను అధికారులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.