
2019–20 హోమ్ సీజన్ షెడ్యూల్ రిలీజ్
న్యూఢిల్లీ: భాగ్యనగరం మరో అంతర్జాతీయ టీ20కి ఆతిథ్యం ఇచ్చే చాన్స్ కొట్టేసింది. 2019–20 హోమ్సీజన్లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను సోమవారం బీసీసీఐ విడుదల చేసింది. డిసెంబర్ 11న వెస్టిండీస్‌తో టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఇక విశాఖపట్నంలో అక్టోబర్ 2–6 వరకు సౌతాఫ్రికాలో టెస్టు, డిసెంబర్ 18న విండీస్‌తో ఓ వన్డే జరుగనున్నాయి. సెప్టెంబర్ 15న సౌతాఫ్రికాతో ఫ్రీడమ్ సిరీస్‌తో ఇండియా హోమ్సీజన్ మొదలవనుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 23 వరకు మూడు వన్డేలు, మూడుటెస్టులు ఆడనుంది. అనంతరం నవంబర్ 3 నుంచి 26 వరకు బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులలో తలపడనుంది. ఇండియాలో బంగ్లా ఆడుతున్న పూర్తిస్థాయి సిరీస్ ఇదే కావడం విశేషం. ఇక డిసెంబర్ 6 నుంచి 22 వరకు వెస్టిండీస్‌తో మూడేసి వన్డేలు, టీ20లు ఆడనుంది. 2020 జనవరిలో తొలుత జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను ఆడనున్న టీమిండియా.. అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు ఆతిథ్యమివ్వనుంది. మార్చి 12-–18 మధ్య సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.