హైదరాబాద్ US కాన్సులేట్లో కొత్త రూల్స్.. అతిక్రమిస్తే గేట్ బయటికే

హైదరాబాద్ US కాన్సులేట్లో కొత్త రూల్స్.. అతిక్రమిస్తే గేట్ బయటికే

హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ ప్రాంగణంలో  నిషేధించిన కొన్ని వస్తువుల జాబితాను విడుదల చేసింది. వీటిలో సెల్ ఫోన్‌లు, బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు, పర్సులు, ట్రావెల్ బ్యాగ్‌లు, బ్యాక్‌ప్యాక్‌లు, బ్రీఫ్‌ కేస్‌లు, సూట్‌కేస్‌లు (సీల్ చేయని ప్లాస్టిక్ బ్యాగులు, చిన్న క్లాత్ బ్యాగ్‌లు, జిప్ ఫోల్డర్‌లు మినహా) ఔట్ సైడ్ ఫుడ్, డ్రింక్స్ ఉన్నాయి.

ఇవేకాకుండా  కాస్మొటిక్స్, మూసివున్న ఎన్వలప్‌ కవర్స్, ప్యాక్ చేసిన లగేజీ, మండే వస్తువులు, పదునైన వస్తువులు, ఆయుధాలు, పొడవాటి హ్యాండిల్ గొడుగులు, మత సాధనాలు, మసాలా దినుసులు లాంటి పౌడర్‌లు కూడా ఉన్నాయి.

పొరపాటున తీసుకెళ్లినా కాన్సులేట్ దగ్గర్ చెక్కింగ్ ఉంటుంది. వాళ్ల చేసే స్కానింగ్ లో నిషేదించిన వస్తువు ఏది తెచ్చినా కాన్సులేట్ సెక్యూరిటి బయటికి పంపించేస్తారు. కొత్త కాన్సులేట్ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇలాంటి సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.