పరిధి పెరిగింది.. బాధ్యతా పెరగాలి.. ఉద్యోగుల‌‌కు వాటర్బోర్డు ఎండీ సూచ‌‌న‌‌

పరిధి పెరిగింది.. బాధ్యతా పెరగాలి.. ఉద్యోగుల‌‌కు వాటర్బోర్డు ఎండీ సూచ‌‌న‌‌
  • ఇంజినీర్స్​ డైరీల ఆవిష్కరణ

హైదురాబాద్​సిటీ, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ పరిధి పెరిగిన నేపథ్యంలో బోర్డు పరిధి కూడా పెరుగుతుందని, దాంతోపాటు ఉద్యోగుల బాధ్యతలు పెరగాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలో కొత్త బాధ్యతలు నిర్వహించడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. వాటర్ బోర్డు ఇంజినీర్స్ అసోసియేషన్, టీజీవో, టీఎన్జీవో డైరీలను మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం బోర్డు ఆఫీసులో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, పర్సనల్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్, ఆపరేషన్ డైరెక్టర్ వినోద్ భార్గవ, జేఈఏ అధ్యక్షుడు రాజశేఖర్, టీజీవో జనరల్ సెక్రటరీ చంద్రజ్యోతి, టీఎన్జీవో జలమండలి శాఖ అధ్యక్షుడు మహేశ్ కుమార్, జనరల్ సెక్రటరీ అజయ్ సింగ్ పాల్గొన్నారు.