హైదరాబాద్‌‌‌‌లో పాన్‌‌‌‌ ఇండియా మాస్టర్స్ గేమ్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌లో పాన్‌‌‌‌ ఇండియా మాస్టర్స్ గేమ్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: తొలి పాన్ ఇండియా ఫెడరేషన్ కప్ నేషనల్ మాస్టర్స్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 22 నుంచి 24 వరకు ఎల్బీ స్టేడియంలో  జరిగే టోర్నీలో అథ్లెటిక్స్‌‌‌‌, వాలీబాల్, బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌, స్విమ్మింగ్‌‌‌‌, బ్యాడ్మింటన్‌‌‌‌, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ పోటీలు ఉంటాయని మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్‌‌‌‌ జనరల్ సెక్రటరీ నటరాజ్‌‌‌‌ శనివారం తెలిపారు. 

పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను  ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ హేమప్రభ, ఆర్గనైజింగ్ సెట్రటరీ రామా రావు, రాష్ట్ర ఒలింపిక్‌‌‌‌ సంఘం సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్‌‌‌‌ తదితరులు రిలీజ్‌‌‌‌ చేశారు.